-గ్రామంలో చెత్త సేకరణపనులు చేపట్టాలి.

 

 

 

 

 

 

 

 

-మారెడుమాన్ దిన్నె బిజెపి నాయకులు డిమాండ్.
-గ్రామ సమస్యలపై ఎంపీడీవో కు వినతిపత్రం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి13(జనంసాక్షి):మా గ్రామంలో గత ఐదు నెలలుగా చెత్త సేకరణ పనులు జరగడం లేదని మారెడు మాన్ దిన్నె గ్రామ బిజెపి నాయకులు మండిపడ్డారు.నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని మారెడు మాన్ దిన్నె గ్రామ బిజెపి నాయకులు గత ఐదు నెలలుగా గ్రామంలో నెలకొని ఉన్న వివిధ సమస్యలపై సోమవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కృష్ణయ్యను తన కార్యాలయంలో కలిసి వివరించి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు మేకల శివుడు, సోషల్ మీడియా ఇంచార్జీ దాసర్ల యాదగిరి మాట్లాడుతూ మా గ్రామంలో గత ఐదు నెలలుగా పరిశుద్ధ కార్యక్రమాలు జరగడం లేదని మరియు చెత్త సేకరణ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో నాటిన చెట్లకు మరియు ఫార్క్ లో ఉన్న చెట్లకు నీళ్లు పోయడం లేదని అన్నారు.పలు సమస్యలపై గత ఐదు నెలల నుండి గ్రామ సభలో ప్రశ్నించినా ఫలితం లేక పోయిందని అన్నారు.అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయం లోనే గ్రామ పంచాయతీ కార్యదర్శి సలేశ్వరం కు కూడా వినతిపత్రం అందజేశారు. గ్రామ సమస్య లపై స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మారెడు మాన్ దిన్నె బిజెపి నాయకులు, కార్యకర్తలకు పార్టీ మండలా ధ్యక్షుడు పదిర భీమేశ్వర్ రెడ్డి మద్దతు తెలపి ఎంపీడీవో తో చర్చించి తొందరగా పరిష్కారం అయ్యోలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు చెటమోనీ రాము, ప్రధాన కార్యదర్శి గార్దుల శివశంకర్,పెబ్బేటి కరుణాకర్ కార్యకర్తలు వంకేశ్వరం నాగేంద్రం, జరుపటి సురేష్, దాసర్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.