గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

బిచ్కుంద మార్చి 04 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల గోపన్పల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శనివారం నాడు నాల్చర్ శ్రీహరి రాజులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఎన్.ఆర్ ఈజిఎస్ నిధులు 25 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొట్టె శ్రీనివాస్, ఎంపీటీసీ సుజాత రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, వెంకట్రావు దేశాయ్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.