గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ రూము ల,వేలం పాట
ఏటూరునాగారం (జనం సాక్షి),మార్చి27.ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో సోమవారం గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ రూమ్ లకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ ఈసం రామ్మూర్తి అధ్యక్షతన బహిరంగ వేలం పాట నిర్వహించారు. గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ రూములకు గత కొన్ని సంవత్సరాలుగా రూములకు వేలంపాట నిర్వహించక పోవడం. ఏటూర్ నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు కోరిక మేరకు రూములు వేలంపాట బహిర్గతంగా నిర్వహించాలని గ్రామ ప్రజలు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించడంతో స్పందించిన జిల్లా అధికారులు ముందస్తుగా వివిధ దినపత్రికలలో బహిరంగ వేలం పాట నిర్వహణ నిబంధనలు ప్రచురించడం జరిగింది. అధికారుల ఆదేశాల మేరకు ఎటూర్ నాగారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు ముందస్తుగా రూములు పొందడం కోసం డిపాజిట్ కేటాయించి బహిరంగ వేలం పాటలో పాల్గొన్నారు. ఇట్టి బహిరంగ వేలం పాటలో గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు ప్రజాసంఘాల నాయకులు వివిధ వ్యాపార వర్గాలు పాల్గొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారుల ఆదేశాల మేరకు వేలం పాటలో ఏటూర్ నాగారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రూములు క్రింది భాగంలో వి వ్యాపార సముదాయానికి మెయిన్ రోడ్డుకు బస్టాండ్ ప్రాంతంలో ఉండడం చేత వ్యాపార సముదాయానికి అనుకూలంగా ఉండి రూములకు మంచి డిమాండ్ పెరిగింది. ఇట్టి రూముల వేలంపాటలో పటాదారులు పోటీ మరీ విపరీతంగా ఉండడంతో పోటి తీవ్రత పెరిగింది. మొదటి రూము వేలంపాటలో గీకురు భాగ్య రూ. 22,500 కు. వేలంపాటలో రూమును కైవసం చేసుకున్నారు.. రెండవ రూము చంద్రశేఖర్. రూ. పదివేల 500 కు కైవసం చేసుకున్నారు. మూడవ రూము బట్టు గోపి 25వేల100కు కైవసం చేసుకున్నారు. పైన రూములకు డిమాండ్ లేకపోవడంతో.. వాటి వేలం పాటలు పాల్గొనడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇద్దరు మాత్రమే ముందుకు వచ్చి… మొదటి రూము6000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. మూడవ రూము 4000 రూపాయలకు కైవసం చేసుకున్నారు.. గంప చిట్టి రామ టెంకి రాజ్ కుమార్ రెండు లక్షల 50 వేలకు కైవసం చేసుకున్నారు. కూరగాయల మార్కెట్ రూములు. గాంధీ విగ్రహం వద్ద కాంప్లెక్స్ రూములు డిమాండ్ లేకపోవడంతో అది తక్కువ ధరకు వేలంపాట నిర్వహించారు. రూములు కేటాయింపు ఓకే సామాజిక వర్గాలకు ఏళ్ల తరబడి అద్దెలకు ఇవ్వడం ఏమిటి అని ఇతర దళిత సామాజిక వర్గాలకు రూములు వ్యాపార సముదాయాలకు కేటాయించాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వ్యాపార సముదాయాలు రూములను ఇతర నాన్ లోకల్ ప్రాంతవాసులకు కేటాయించవద్దని స్థానికులకు కేటాయించాలని అద్దె కిరాయిలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు చిటమట రఘు వావిలాల చిన్న ఎల్లయ్య గ్రామపంచాయతీ సర్పంచ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ ,బిల్ కలెక్టర్లు, రవీందర్, సర్వ వెంకన్న, లక్ష్మీనారాయణ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.