గ్రూప్‌-1 నియామకాలపై స్టే ఎత్తివేత

హైదరాబాద్‌: గ్రూప్‌-1 సర్వీసుల నియామకాలను లైన్‌ క్లియర్‌ అయింది. నియామకపు ప్రక్రియపై దాఖలైన కేసులో ఏపీపీఎస్సీకి అనుకూలంగా ఏపీ అడ్మినిస్ట్రేటీవ్‌ ట్రైబ్యునల్‌ తీర్పునిచ్చింది. ఈ సర్వీసుల నియామాక ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో తాను ఇచ్చిన స్టేను ఏపీ అడ్మినిస్ట్రేటీవ్‌ ట్రిబ్యునల్‌ ఎత్తివేసింది. దీంతో 341 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కమిషన్‌ సన్నాహాలు ప్రారంభించింది. గ్రూప్‌-1 ఫైనల్‌ ‘ కీ’లో తప్పులున్నాయంటూ కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ట్రైబ్యునల్‌ తాత్కాలింకగా స్టే విధించిన విషయం తెలిసిందే.

తాజావార్తలు