గ్రూప్‌ 4 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి – కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఏపీపీఎస్సీ ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌ 4కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఈ పరీక్షకు 11 వ తేదిన 55, 506 మంది అభ్యర్థులు 12, వతేదీన 9468 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరువుతున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షలు 11 తేదిన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 నిముషాల వరకు, మద్యాహ్నం 2 గంటల నుంచి  4:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ పరీక్షకు నిర్వహణకు 11 వతేదిన 122 కేంద్రాలు, 12 వ తేదిన 9 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. జిల్లాలో 11 తేదిన కరీనగర్‌లో 72 కేంద్రాల్లో 40,3032 మంది అభ్యర్థులు, గోదావరి ఖనిలో 9 కేంద్రాల్లో 3850 జగిత్యాలలో 12 కేంద్రాల్లో 5100 మంది పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో 17 కేంద్రాల్లో 5056, సిరిసిల్ల 12 కేంద్రల్లో 5100, అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరిడెంట్‌ 11వ తేదిన పరీక్షలు పర్యవేక్షణ చేయడానికి 45 రూట్లలో 45 మంది తహశీల్దార్లును లైజర్‌ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. 12 వ తేదిన 9 రూట్లలో 9 మంది తహశీల్దార్లును లైజన్‌గా అధికారులుగా పర్యవేక్షనకు నియమించినట్లు ఆమె తెలిపారు. ఒక్కోక్క పరీక్ష కేంద్రంలో డిప్యూటీ తహశీల్దారు, సీనియర్‌ అసిస్టెంట్లను సహాయ లైజన్‌ అధికారులుగా సిట్టింగ్‌ స్వాడ్లను నియమించినట్లు తెలిపారు. అదనపు జేసీ, జిల్లా రెవెన్యూ అధికారిని జిల్లా కో ఆర్డినేటర్‌గా సంబంధిత ఆర్‌డీవోలను అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌లుగా నియమించినట్లు ఆమె వెల్లడించారు. పరీక్ష రాస్తున్న అభ్యర్థులు పరీక్ష రోజున గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.  అభ్యర్థులు జవాబు పత్రం నింపేందుకు బ్లూ లేదా, బ్లాక్‌ పెన్‌ సర్కిల్‌ బబ్బింగ్‌ చేయలన్నారు. వైట్‌నర్‌లు, మొబైల్‌ ఫోన్‌లు పరీక్ష కేంద్రానికి అనుమతించడం లేదన్నారు. ప్రతి ఆన్సర్‌ షీట్‌ రెండు కాపీలను కలిగి ఉంటుందని పైన ఒరిజనల్‌ ఇన్విజిలెటర్‌కు అందజేయాలని, డూప్లికేట్‌ అభ్యర్థికి పరీక్షపూర్తయిన తరువాత ఇంటికి తీసుకెళ్లవచ్చన్నారు. అభ్యర్థులు రిజష్టర్‌ నంబర్‌ బుక్‌లెట్‌ సీరిస్‌, పేపర్‌కోడ్‌, సబెక్జ్‌ తదితర వివరాలు బ్లూ లేదా బ్లాక్‌ పాయింట్‌ పెన్‌తో సరిగా నింపాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ విధించి జీరాక్స్‌ కేంద్రాలను మూసి వేయనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా ఎస్పీ రవీందర్‌ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాతంగా నిర్వహించేందుకు తగిన పోలీస్‌ బందో బస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా క్రమ బద్దీకరించనున్నట్లు తెలిపారు. పోలీస్‌ ఇన్స్‌స్పెక్టర్లును సబ్‌ఇన్‌స్పెక్టర్లును పరీక్షా కేంద్రాల దగ్గర పెట్రోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. అదనపు జేసీ సుందర్‌ అబ్నార్‌ మాట్లాడుతూ పరీక్షకు ముందు ఒక రోజు కేంద్రాన్ని సందర్శిస్తే ఎలాంటి గందరగోళానికి తావుండదన్నారు. పరీక్ష జరిగే సమయంలో నిరంతర విద్యుత్‌, సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్‌, అంబులెన్స్‌, సర్వీసులు సిద్ధంగా ఉంచుతున్నట్లు ఆర్టీసీ బస్సులను తగు విధంగా ఏర్పాటు చేసేలా ఆర్టీసీ రిజియన్‌లె మేనేజర్‌కు ఆదేశాలిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పరీక్షకు సంబంధించి ఛీప్‌ సూపరిడెంట్లతో లైజన్‌ అధికారులుతో అదనపు జేసీ సుందర్‌ అబ్నాల్‌ పలు సూచనచేశారు.