గ్రూప్1లో గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనంపై విద్యార్ధి సంఘాల ఆగ్రహం
హైదరాబాద్: గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేయటంపై పలు విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు విద్యార్ధి సంఘాలు ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ర్యాలీ నిర్వహించాయి. వందలాది మందితో జరిగిన ఈ ర్యాలీ అర్ట్స్ కళాశాల నుంచి మొదలై ఎన్‌సీసీ గేట్ వరకు సాగింది. విద్యార్థుల ర్యాలీకి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను పాత విధానంలో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు.