ఘనంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
హుజుర్ నగర్ మార్చి 13 (జనంసాక్షి): భారత జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకను జాగృతి జిల్లా నాయకులు ఎస్.కె మస్తాన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. హుజూర్ నగర్ పట్టణంలోని శివాలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా నాయకులు ఎస్.కె మస్తాన్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఖ్యాతిని విశ్వ వ్యాపితం చేసిన ఘనత కవితదేనని అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న నాయకురాలు కవిత పై సిబిఐ, ఈడి నోటీస్ లతో వేదిస్తున్నారన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటూ ప్రశ్నించే వారిపై ప్రయోగిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కవిత కాదని, ఉద్యమం నుండి వచ్చిన ధీర వనిత అన్నారు. దేశ సంపదను ఆదాని లాంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ దేశ సంపదను లూటీ చేస్తున్నారన్నారు. కవితకి జాగృతి సైనికులందరం అండగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా కో-కన్వీనర్ కె. గోవర్ధన్, నియోజకవర్గ కన్వీనర్ కె ఎస్ ఎన్ రెడ్డి, నియోజకవర్గ మహిళా కన్వీనర్ భోద లక్ష్మీ, పట్టణ కన్వీనర్ దుండిగాల నారాయణ, పట్టణ మహిళా కన్వీనర్ ఎస్.కె రహీమా, ఎం. నాగేశ్వరరావు, సిహెచ్. నర్సింహ రావు, ఉదారి సుధాకర్, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, ఉదారి భద్రి, చందాల ఉమా, తోట ఉమా, నాగమణి, చంద్రకళ, నాగలక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.