ఘనంగా ప్రారంభమైన ఆటా మహాసభలు

అట్లాంటా: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 12 మహాసభలు అట్లాంటా నగరంలో ఘనంగా  ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఇవి జరగనున్నాయి. వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లంరాజు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు డీకే అరుణ, శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ ఎంపీ అజహరుద్దీన్‌, సినీనటి ఇలియానా, ఇతర ప్రముఖులు ఇప్పటికే  అట్లాంటా చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, న్యూజెర్సీ డిప్యూటీ స్పీకర్‌ చివుకుల ఉపేంద్ర, సినీ ప్రముఖులు ‘దిల్‌’ రాజు, ఏవీఎస్‌, గుండు హనుమంతరావు, సంగీత దర్శకుడు తమన్‌, గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ తదితరులు కూడా మహాసభలకు హాజరు కానున్నారు.