ఘనంగా ఫోటో గ్రాఫర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడి జన్మదినం.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
నాగర్ కర్నూల్ జిల్లా ఫోటో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు నేతాజీ గౌడ్ పుట్టిన రోజు వేడుకలను జిల్లా కోశాధికారి గుల్ల చెన్నకేశవులు ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేకును కత్తిరించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నేతాజీ గౌడ్, మరియు జిల్లా కోశాధికారి చెన్నకేశవులు మాట్లాడుతూ ఫోటో గ్రాఫర్స్ సమస్యలపై అనునిత్యం శ్రమిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శీను, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లామాజీ అధ్యక్షులు రమేష్, జిల్లామాజీ అధ్యక్షులు ప్రసాద్, సుధాకర్ రెడ్డి, శేఖర్, సలాం,బూషిపాక శ్రీను, అశోక్, భాష, సుల్తాన్, కిషోర్, సురేష్, మిద్దె రవి తదితరులు పాల్గొన్నారు.