ఘనంగా రాములోరి కళ్యాణం.


ఫొటో : కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.బెల్లంపల్లి, మార్చ్ 30, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం శ్రీరామ నవమి సందర్బంగా ఆలయాల్లో రాములోరి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని కోదండ రామాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క, పాల్గొని ప్రతేక పూజలు చేశారు. నెన్నెలలో జడ్పీటీసీ సింగతి శ్యామల రాంచందర్, ఆత్మ చైర్మన్ సున్నం కల్పన రాజు దంపతులు వధూవరుల తరుపున పాల్గొని కల్యాణ వేడుక జరిపించారు. జోగాపూర్ లో మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గడ్డం కళ్యాణి భీమా గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం జరిపించారు. గొల్లపల్లిలో మొదటిసారిగా సీతారాముల కల్యాణ వేడుకలు సర్పంచ్ ఇందూరి శశికళ రమేష్ ఆధ్వర్యంలో అంబిలపు సుగుణ పోశం దంపతులు, పూదరి మౌనిక రమేష్ దంపతులు వధూవరుల తరుపున వివాహ వేడుకలు జరిపించారు. కుశ్నపల్లి, కాసిపేట ధర్మారావు పేట, తాండూర్, కన్నెపల్లి, వేమనపల్లి, భీమిని మండలాల్లో సీతారాములు కల్యాణ వేడుకలు నియమ నిష్టలతో, భక్తి భావంతో జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ సేవా సమితి, కుల సంఘాల ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు.