చంద్రబాబు పట్టువస్ర్టాలు సమర్పించకూడదు : ఉత్తరాంధ్ర సాధుపరిషత్
విజయనగరం, మార్చి 22 : చంద్రబాబుకు పురిటిమైలు ఉందని, కాబట్టి ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుడికి పట్టవస్ర్తాలు సమర్పిండం అపచారమని ఉత్తరాంధ్ర సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. శాస్త్ర సమ్మతం కాని ఒంటిమిట్లను ఎంపిక చేశారనడానికి ఇదో నిదర్శనమని ఆయన అన్నారు. రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలను ప్రభుత్వం తరపున జరిపేందుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వాలని కోరుతూ స్థానిక మహారాజ కోట వద్ద ఉత్తరాంధ్ర సాధుపరిషత్ ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ తాత అయిన చంద్రబాబుకు పురిటి మైలు ఉంటుందని, కాబట్టి శ్రీరాముడికి పట్టువస్ర్తాలు సమర్పించకూడదని అన్నారు.