చంద్రబాబు బీసీల మీద చూపుతున్న ప్రేమ కొంగజపం

ఏటూరు: ప్రతిపక్షనేత చంద్రబాబు బీసీల మీద చూపుతున్న ప్రేమ కొంగజపం లాంటిదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు భాగోతం బీసీలందరికీ తెలుసని, ఆయన 9ఏళ్ల పాలనలో ఏడాదికి సగటున రూ. 158 కోట్లు మాత్రమే వెచ్చించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004 నుంచి 2012 వరకూ ఏడాదికి రూ. 911 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఈ ఏడాది తొమ్మిదిన్నర కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 209 కోట్లకు పెంచామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో గొర్రెల పెంపకం దార్ల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 30 మంది గొర్రెల పెంపకందారులకు రూ. 30 లక్షల రుణాలను నీఎం పంపిణీ చేశారు.