చట్టాల పై అవగాహన కలిగి ఉండాలి
బోథ్(జనం సాక్షి) చట్టాల గురించి అవగాహనా కలిగి ఉండాలని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి బి హుస్సేన్ అన్నారు. శనివారం బోథ్ మండల కేంద్రంలోని పిప్పల్దారి గ్రామపంచాయతిలో మండల సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతితిగా హాజరై గ్రామస్తులకు చట్టాల గురించి అవగాహన కల్పించారు. పిల్లలను బాల్యం నుండే నాణ్యమైన విద్యతో పాటు మంచి సంస్కారం తల్లిదండ్రులు అందించాలని ఏ సమస్య వచ్చినా చట్టానికి లోబడే పని చేయాలని విద్యాహక్కు బాల్యవివాహాలు వరకట్న నిషేధం మోటారు వెహికిల్ సైబర్ నేరాలు మహిళలపై జరిగే ఆగత్యాలు రైతులు పండించే పంటలను అమ్మేటప్పుడు దళారీల చేతులలో మోసపోవద్దని ఏదయినా వస్తువు కొన్నపుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా గ్రామానికి విచ్చేసిన జడ్జి గారిని గ్రామస్తులు సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, బార్ అసోసియేషన్ సెక్రటరీ పంద్రం శంకర్, న్యాయవాది కుమ్మరి విజయ్ కూమార్, ఉప సర్పంచ్ కోర్టు సూపరిండెంట్ శేఖర్ రెడ్డి, పిసి విజయ్, స్రవంతి మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.