చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళి.
మంగపేట,సెప్టెంబర్ 10(జనంసాక్షి):-
మంగపేట మండలము తెలంగాణ సెంటర్లో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఘన నివాళి అర్పించారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుదురుపాక చిట్టిబాబు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టీ చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు పెత్తందారులని ఎదిరించి మనందరిలో స్ఫూర్తి నింపిందని, భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కుదురుపాక చిట్టిబాబు,చల్లగురుగుల తిరుపతి,పున్నం నాగలక్ష్మి, పున్నo వెంకటేశ్వర్లు,గట్టి కొప్పుల ఉపేందర్,ముప్పరపు సందీప్,కొమరయ్య,రమేష్,శంకర్,సరి త, నారాయణ,రమాదేవి,గణేష్,రజక సంఘం పెద్దలు,నాయకులు పాల్గొన్నారు.