చిదంబరంతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ హోంమంత్రి చిదంబరంతో ఈ ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.  ఈ పర్యటనలో గవర్నర్‌ రాష్ట్రపతి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రతిభాపాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు తెలిసింది.