చిన్నపరెడ్డిని విడుదల చేయకపోతే ఆందోళణలు ఉద్ధృతం చేస్తాం

నల్గొండ: నాగర్జునసాగర్‌ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టుని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాకు చెందిన మంత్రి జానారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కక్ష సాధింపు చుర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమోత్తారు. తక్షణం చిన్నపరెడ్డిని విడుదల చేయకపోతే ఆందోళణలు ఉద్థృతం చేస్తామని హెచ్చరించారు.