‘ చిన్నారి చూపు ‘ను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్ : రాష్ట్రంలో నేత్ర సమస్యలున్న బడి ఈడు పిల్లలందరికీ కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం చిన్నారి చూపును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పబ్లిక్ గార్డెన్స్‌లోని లలితకళాతోరణంలో రాజీవ్ విద్యామిషన, వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం 200 మంది పిల్లలకు ఆంఛనంగా కళ్లజోళ్లను అందించారు. రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలకు ప్రాథమికంగా కంటి పరీక్షలు నిర్వహించామని, అందులో 4 లక్షల 7 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించినట్లు సీఎం తెలిపారు. తెలిపారు. ఈ రోజు ప్రారంభమైన చిన్నారి చూపు కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 31 వరకు అన్ని మండల కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు.