చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే తిరుమల అవిత్రమవుతుందని చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ చిరంజీవికి నోటీసులు జారీ చేసింది.