చిరంజీవి సీఎం అభ్యర్థి అయితే తప్పేంటీ?
హైదరాబాద్, తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని దేవాదాయా శాఖ మంత్రి సి. రామచంద్రయ్య తెలిపారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014 చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తప్పేంటని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరి న్యాయకత్వం కోరుకుంటారో ప్రజలే చూసుకుంటారని రామచంద్రయ్య వ్యాఖ్యనించారు. కర్ణాటకలో కాంగ్రెస్ క్లీన్ ఇమేజ్ ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు క్లీన్ ఇమేజ్ ఉంటేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.



