చిరుధాన్యాలపై అవగాహనచిరుధాన్యాలపై అవగాహన
గుడిహత్నూర్,: మార్చ్ 28(జనం సాక్షి) మండల కేంద్రంలోని జవహార్ నగర్ అంగన్వాడి కేంద్రం 1 లో పోషణ పక్షంలో భాగంగా మంగళవారం తల్లులకు చిరుధాన్యాలు, రక్తహీనతపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ వనజ మాట్లాడుతూ. చిరుధాన్యాల ప్రాముఖ్యత , సమతుల్యం ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు మంచి ఆహారానికి దూరమవుతున్నారని, ప్రస్తుత జీవితంలో చిరుధాన్యాల అవసరాన్ని వివరించడంతోపాటు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. బాలికల్లో రక్తహీనత లోపాన్ని నివారించడానికి ఆకుకూరలు, ఐరన్ చాలా ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జాధవ్ సునిత, మండల సెక్టారు సూపర్వైజర్ పద్మ, పంచాయతీ కార్యదర్శి రాందాస్,అంగన్వాడి టీచర్లు సంగీత, మిరాబాయి, లక్ష్మి, తల్లులు, గర్భిణీలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.