చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసిన శ్రీహరి
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 10(జనం సాక్షి)
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లాడిపోతు రోడ్డు పక్కనే ఉన్న చిరు వ్యాపారులకు అండగా నిలిచేందుకు మానవతా దృక్పథంతో మాజీ షాప్ డైరెక్టర్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజనాల శ్రీహరి శనివారం వరంగల్ లో జేపీఎన్ రోడ్, స్టేషన్ రోడ్ ,పోస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో 100 గొడుగులకు పైగా గొడుగులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి మాట్లాడుతూ రోజువారి జీవనోపాధిలో భాగంగా వివిధ చిరు వ్యాపారాలు చేసుకునే వారు వర్షానికి తడిసి పోతున్న దృశ్యాల్ని చూశానని వారికి వర్షం నుండి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తాను గొడుగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. గతంలో కూడా తాను ఇలాంటి వారికి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశానని శ్రీహరి పేర్కొన్నారు. గొడుగు పై కేటీఆర్ జిందాబాద్.. రాజనాల శ్రీహరి అని రాసి ఉండడం కనిపిస్తుంది.