చురుగ్గా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా చురుగ్గా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా, తెలంగాణలో పలుచోట్ల, దక్షిణకోస్తా రాయలసీమలో జల్లులు కురిసే అవకాశం ఉంది.