చెరువులో పడిన స్కూలు బస్సు

ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు వద్దఈ రోజు ఉదయం విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూలు బస్సు చెరువులో పడింది. ఈప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన విద్యార్థులనే ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘోర ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.