చేతి పంపు బోరింగ్ ఉన్న స్థానంలో బోర్ మోటర్లును ఏర్పాటు చేయాలి
.చేతి పంపు బోరింగ్ ఉన్న స్థానంలో బోర్ మోటర్లును ఏర్పాటు చేయాలిజనం సాక్షి ,(భువనగిరి ఆర్.సీ)న్యూస్:భువనగిరి పురపాలక సంఘం సాధారణ సమావేశం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి చైర్మన్ ఏన్నబోయిన ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో భువనగిరి పట్టణంలో ఎండాకాలం దుష్ట హైదరాబాద్ సైనిక్ పూరి నుండి కృష్ణ మెట్రో వాటర్ బోర్డు వారు సప్లై చేసే మంచినీళ్లు కొన్ని అనివార్యకారణాలవల్ల పట్టణంలో మంచినీటి సరఫరా కాకపోతే పట్టణ ప్రజలకు నీటి కొరత రానీయకుండా వివిధ వార్డులలో ప్రధాన కూడలిలలో పురాతనమైన చేతిపంపు బోరింగ్ ఉన్న స్థానంలో బోర్ మోటర్ లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి,మరియు ,చైర్మన్ ఆంజనేయులుని 23వవార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ కోరడం జరిగింది. ఈసందర్భంగా కౌన్సిలర్ రేణుక మాట్లాడుతూ భువనగిరి పట్టణంలో ఎండాకాలం దుష్ట నీటి కొరత ఇబ్బంది ప్రజలకు కలగకుండా హైదరాబాద్ సైనిక్ పూరి కృష్ణ మెట్రో బోర్డ్ వాటర్ సప్లై రోడ్లు మరమ్మతవల్ల రైల్వే ట్రాక్లు మరమ్మతుల వల్ల కొన్ని అన్వార్యకారణాలవల్ల పట్టణంలో మంచినీటి సప్లై జరగనప్పుడు మున్సిపల్ అధికారులు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా వివిధ వార్డులలోకి వాటర్ సప్లై చేసిన ప్రజలకు పూర్తి స్థాయిలో నీళ్లు సప్లై కావడం లేదు. గతంలో మున్సిపల్ వారు ఏర్పాటుచేసిన చేతిపంపు బోరింగ్ లు నిరుపయోగంగా ఉన్న బోర్లలో నీళ్లు ఉన్నప్పటికీ కూడా మనం అట్టి నీళ్లను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందుతున్నమని తక్షణమే చేతిపంపు బోరింగ్ ఉన్న స్థానంలో పవర్ మోటర్లు ఏర్పాటు చేస్తే ఏక్కడి ప్రజలు అక్కడనే మంచినీళ్ల పట్టుకోవడం జరుగుతుందని అప్పుడు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు సప్లై చేసే అవసరం కొన్ని ప్రాంతాలకు ఉండదని మూడు రోజులకు ఒకసారి కృష్ణ వాటర్ వార్డులలోకి సప్లై చేసిన మిగతా రోజులలో చేతిపంపు బోరింగ్ లలో బోరు మోటర్లు ఏర్పాటు చేసే వాటి ద్వారా నీళ్లు పట్టుకుని ప్రజలు నీటి అవసరాలు తీర్చుకుంటారని ప్రజల అవసరాల దృష్ట ప్రజలకు నీటి కొరత ఏర్పడకుండా వెంటనే బోర్ మోటార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు తంగెలపల్లి శ్రీవాణి , ఊదరి లక్ష్మి, పచ్చళ్ళ హేమలత, వడిచర్ల లక్ష్మి, నజీమా, తదితరులు పాల్గొనడం జరిగింది.