చేనేత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:కార్మికసంఘం డిమాండ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్దికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చేనేత కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం పట్టించుకొవటంలేదని, రాధానిలో జరిగిన రాష్ట్ర సదస్సులో సంఘం నేతలు అన్నారు. చేనేత కార్మికులకు కనీస వేతనాలు అమలుచేయాలని, వృత్తి రక్షణ, చేనేత విధానంపై సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపోందించాలని క్రెడిట్‌ గ్యారంటీ పథకాలు అమలుచేయాలని అన్నారు.