జంతర్‌మంతర్‌ వద్ద అన్నా బృందం దీక్ష

న్యూఢిల్లీ: అన్నాహజరే బృందం ఈరోజు ఢిల్లీలోని జంతర్‌మంత్‌ వద్ద నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించింది. బలమైన లోక్‌పాల్‌ బిల్లును వెంటనే ఆమోదించాలని,  మంత్రులపై తాము చేసిన అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని ఈ బృందం డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బృందంలోని కీలక సభ్యులు అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌, శిశోడియా, గోపాల్‌రాయ్‌ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. అన్నాహజరే ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా నిరాహార దీక్ష చేపట్టారని డాక్టర్లు చెప్పటంతో ఈ రోజు అన్నా దీక్ష బదులు ధర్నా చేపట్టారు. దీక్షాస్థలికి చేరుకునే ముందు అన్నాబృందం రాజ్‌ఘాట్‌ మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించివచ్చింది.