జగన్‌ను కలుసుకున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయ, భార్య భారతి, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌లు జగన్‌ను ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు. దాదాపు గంటన్నర సేపు జైల్లోనే జగన్‌తో వివిధ అంశాలపై చిర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అంశాలపైనే జగన్‌ వద్ద వీరు ప్రస్తావించినట్లు  సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై మద్దతు తెలపాలంటూ ఎన్డీఏ అభ్యర్థి సంగ్మా కలిసిన అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. జగన్‌ను కలిసిన అనంతరం దీనిపై మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నించినా వైఎస్‌ విజయ సమాధానమివ్వకుండా వెళ్లిపోయారు.