జగన్‌పార్టీ అన్యాయాలు ప్రధానికి తెలియజేస్తాం: లగడపాటి

న్యూఢిల్లీ: జగన్‌ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలియజేప్తామని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. కొడుకు మీద ప్రేమతోనే వైఎస్‌ విజయమ్మ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని  ఆయన అన్నారు. ఆమె తన పర్యటనలో రైతుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని లగడపాటి అన్నారు. సీబీఐ అధికారి లక్ష్మీనారాయణపై సాక్షిలో తప్పుడు కథనాలు వస్తున్నాయన్నారు. లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ నేతలతో ఎప్పుడూ మాట్లడలేదన్నారు. పీజీ, ఎంబీబీఎస్‌ సీట్లు తెలంగాణాలోనే ఎక్కువగా ఉన్నాయని లగడపాటి వెల్లడించారు.