జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్‌ (1). 13 (2). ఐపీసీ 120 (బి). 420. 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనతో పాటు గాలి సొదరుడు సోమశేఖర్‌రెడ్డి, దశరథ రామిరెడ్డి, సురేష్‌బాబు, చలపతిరావు, యాదగిరి, రవిచంద్రలపై కూడా కేసు నమోదు చేశారు. కేసు విచారణను ఏసీబీలోని సెంట్రల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ యూనిట్‌ దర్యాప్తు చేయనుంది.