జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి

యానాం: పుదుచ్చేరి ప్రభుత్వం యానాం నియోజకవర్గం అభివృద్దికి కేటాయించే నిధుల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఇవ్వాల్సిన నిధుల కంటే తక్కువ నిధులు మంజూరు చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ఆరోపించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం యానాం జనాభా 55,616 కాగా పాండిచ్చేరి జనాభా 9,46,600 అని తెలిపారు. 2013-14 వార్షిక బడ్జెట్‌లో 56,81కోట్లు (2.97శాతం) కేటాయించగా, పాండిచ్చేరికి 1600 కోట్లు (83.99శాతం) కేటాయించారని అన్నారు. జనాభా ప్రకారం యానాంకు రూ.89.కోట్లు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. ఈ అంశాన్ని పుదుచ్చేరిలో జరిగిన ప్రణాళికా బోర్డు సమావేశంలో ప్రస్తావించగా రూ.79 కోట్లు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారన్నారు.