జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల పట్టాలు పంపిణీ – జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయు) యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని అన్నారు. హుజూర్ నగర్ జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా కృషి చేయాలని, జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటుగా ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, యూనియన్ ప్రతినిధులు దాచేపల్లి దయాకర్ రెడ్డి, దేనమ కొండ శేషంరాజు, కోమరాజు అంజయ్య, దేవరం రాంరెడ్డి, బసవోజు శ్రీనివాసచారి, కిత రామనాదం, దేవరం వెంకటరెడ్డి, ఇట్టి మల్ల రామకృష్ణ పాల్గొన్నారు.