జల సత్యాగ్రహం ప్రారంభించిన కూదంకుళం ఆందోళనకారులు

కూదంకుళం: కూదంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి నిరసనగా ఆందోళన చేపట్టిన స్థానికులు జల సత్యాగ్రహం ప్రారంభించారు. వారంతా ఈరోజు పక్కనే ఉన్న సముద్రంలోకి వెళ్లినడుంలోతు నీళ్లలో నిలబడ్డారు. భారీగా మోహరించిన పోలీసు  బలగాలు ఆందోళన కారులన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరో పక్క తీర ప్రాంత గస్తీ దళం ఈ  ప్రాంతంలో ఏరియల్‌ సర్వే చేస్తోంది. కూదంకుళం అణువిద్యుత్‌ కేంద్రంలో ఇటీవల యురేనియం ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభించడంతో నిరసన ఉద్యమం తిరగి వూపందుకున్న విషయం విదితమే.