జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ అవార్డు అందుకున్న నందివనపర్తి గ్రామపంచాయతీ
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మార్చ్ 24 (జనం సాక్షి):-యాచారం మండల్ పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీ అవార్డులా కార్యక్రమంలో నందివనపర్తి గ్రామ పంచాయతీ కి దరిద్రరేఖ నిర్ములన, పరిశుభ్రత పచ్చధనం మరియు మౌళిక వసతుల కల్పన యందు నంది వనపర్తి గ్రామ పంచాయతీ కి అవార్డు లకు ఎంపిక కావడం జరిగింది. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ ,మరియు గ్రామ కార్యదర్శి శ్యామసుందర్ రెడ్డి కి ఈ అవార్డు లు ప్రాధానం చేయడం జరిగింది ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ కి మూడు విభాగలలో అవార్డు లకు ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు