జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి జయలలిత వాకౌట్
ఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వాకౌట్ చేశారు. తన ప్రసంగానికి కేవలం 10 నిముషాల సమయాన్ని మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ఆమె వాకౌట్ చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రులు తమ వాణిని వినిపించకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆమె విమర్శించారు.