జాతీయ జెండాను అవమానించారంటూ షారుక్‌ఖాన్‌ పై కేసు నమోదు

పుణె: జాతీయ జెండాను అవమానించారంటూ బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ పై పోలిసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్‌లో వీడియోలో షారుక్‌ జాతీయ జెండాను అవమానించారని లోక్‌జనశక్తి పార్టీ జాతీయ కార్యదర్శి రవి బ్రహ్మే ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఈ నెల 14న షారుక్‌పై కేసు నమోదు చేసినట్లు పోలిసులు మంగళవారం వెల్లడించారు. ఈ కేసును తదుపరి విచారణ కోసం ముంబయి పోలిసులకు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు.