జాతీయ పంచాయతీ అవార్డులు సాధించిన సర్పంచులకు, సెక్రటరీలకు ఘన సన్మానం

జాతీయ పంచాయతీ అవార్డులు సాధించిన సర్పంచులకు, సెక్రటరీలకు ఘన సన్మానం
టేకులపల్లి, మార్చి 24 (జనం సాక్షి ):  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాద్ అమృత మహోత్సవంలో భాగంగా వివిధ విభాగాలలో గ్రామపంచాయతీ సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు  ఘనంగా జాతీయ పంచాయితీ అవార్డులను ఎంపీపీ భూక్య రాధ అధ్యక్షతన ఎంపీడీవో దుద్దుకూరు బాలరాజు ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సన్మానం చేసి అవార్డులను అందజేశారు. మండలంలో 36  గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామపంచాయతీలు పలు క్యాటగిరీల్లో అవార్డులను 9 విభాగాల్లో కు గాను 27 అవార్డులు దక్కించుకొని ప్రతిభ కనబరిచారు. దీంతోపాటు బోడు,  చింతోని చిలుక గ్రామపంచాయతీలు జిల్లా స్థాయిలో ఎంపికైనట్లు ఎంపీడీవో బాలరాజు తెలిపారు.  ఈ సందర్భం గా ఎంపీడీవో బాలరాజు మాట్లాడుతూ ఈ ప్రోత్సకాలను అవార్డులు పొందిన గ్రామపంచాయతీలే కాకుండా  మిగిలిన గ్రామపంచాయతీలు కూడా ప్రోత్సహించడం కోసమే ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో భాగమని, మిగిలిన గ్రామ పంచాయతీలు నిరుత్సాహపడాలసిన అవసరం లేదని  ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగడం కోసమేనని  అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు కార్యాలయపు సిబ్బంది  పాల్గొన్నారు.