జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ముప్కాల్ కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు

జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ముప్కాల్ కృష్ణవేణి స్కూల్ విద్యార్థులుముప్కాల్ ( జనం సాక్షి) శనివారం రోజు నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవనoలో విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ గణిత పోటీ పరీక్షలు విద్యార్థులకు నిర్వహించారు. ఆ పోటీ పరీక్షలకు ముప్కాల్ కృష్ణవేణి హై స్కూల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచి అవార్డులను సాధించారు అనంతరం స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ మా కృష్ణవేణి హై స్కూల్ లో చదివే ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్క విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను  గుర్తించి విద్యార్థుకు ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయుల ద్వారా ఇస్తూ   రాబోయే రోజులలో ముందుకు సాగి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొనే విధంగా మేము ఎల్లపుడు విద్యార్థుల వెంటే ఉంటామని తెలిపారు. శనివారం నిజామాబాద్  జిల్లాలో విశ్వం ఎడ్యుకేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్ . వేదిక్ మాథ్స్  గణిత పోటీ పరీక్షల్లో మా పాఠశాల విద్యార్థులు అర్షియా మనహిల్ 1వ తరగతి.. కోట శ్రీయస్ 2వ తరగతి..గoగొనే యశస్విట్ 4వ తరగతి.. బంటు రీత్విక్ 7వ తరగతికి చెందిన విద్యార్థులు జిల్లాస్థాయిలో ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభను కనపరిచి అవార్డులను పొందారు ఈ కార్యక్రమంలో కృష్ణవేణి హై స్కూల్ ప్రిన్సిపల్ చావన్ రాజేందర్, వైస్ ప్రిన్సిపల్  ప్రవీణ్, కరస్పాండెంట్ నర్సయ్య,  డైరెక్టర్ రాజేందర్. అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్  ఉపాధ్యాయులు.శ్రీవాణి. మౌనిక. మారుతి  పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు