జిల్లా పరిషత్ మరియు ప్రాధమిక ఉన్నత పాఠశాలలను సందర్శించిన జడ్పి సిఈఓ.
ఏటూరునాగారం (జనం సాక్షి), మార్చి 24.
ఈ రోజు ఆకుల వారి ఘణపూర్ ప్రాధమిక పాఠశాల మరియు జడ్పి ఉన్నత పాఠశాలలను, జిల్లా పరిషత్ సిఈఓ.ప్రసూన రాణి సందర్శించడం జరిగింది.ఈ సందర్శనలో భాగంగా మన ఊరి – మనబడి పనుల పురోగతిని పరిశీలించారు. పాఠశాల సుందరీకరణకి సంబంధించిన పనులను పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏటూరునాగారం లో పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల గురించి తెలుసు కున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులందరు కష్టపడి 10/10.జీపీఏ సాధించాలని అలాగే పరీక్ష లు ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలో విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఆనంతుల సురేందర్ మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.