జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇమ్మడి సోమనర్సయ్య

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా తిరుమలగిరికి చెందిన ఇమ్మడి సోమ నర్సయ్య ఎన్నికయ్యారు.తిరుమలగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా, తిరుమలగిరి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో  పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బోనాల రవీందర్, మొరిశెట్టి శ్రీనివాస్, కక్కిరేణి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.