జీపు బోల్తా తప్పిన పెనుప్రమాదం

తిరుమల: తిరుమల అలిపిరి సమీపంలోని వినాయక స్వామి ఆలయం సమీపంలోని ఓ మలుపులో ఒక జీపు అదుపుతప్పి బోల్లా పడింది. అందులో ప్రయాణిస్తున్న 7 గురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. నిన్న తిరుమల వచ్చిన వీరంతా శ్రీవారి దర్శనం చేసుకుని ఈరోజు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు.