జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలి. – జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్.

నెన్నెల, ఫిబ్రవరి 25, (జనంసాక్షి )
మండలంలోని రైతులు తమ తమ జీవాలకు నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్ అన్నారు. శనివారం ఆయన మండలంలోని గంగారాం గ్రామంలో నట్టల నివారణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాలకు నట్టల నివారణ మందులు వేయడం వల్ల జీవాలు ఆరోగ్యవంతంగా ఉంటాయన్నారు. నట్టల నివారణ మందులు వేయక పోవడం వల్ల వాటి ఎదుగుదల నిలిచి బలహీనంగా మారుతాయని వివరించారు. మండలంలో షెడ్యూల్ వారీగా ప్రతి గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందులు వేస్తున్నామని మండల ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, సర్పంచ్ కామెర సుధ శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్ దిలీప్, సిబ్బంది ఉమేష్, శంకర్ రైతులు పాల్గొన్నారు.