జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వం రెండో దఫా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ చర్చలో తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిదని జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రతినిధులు ప్రతినిధులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలకు రూ. 1350 కోట్లు విడుదలకు ప్రభుత్వం అంగీకరించిదని తెలియజేశారు. జీవో 40 ప్రకారం తమకు చెల్లిస్తున్న రూ. 20 వేలు వేతనం  సరిపోదని ప్రభుత్వానికి చెప్పామన్నారు. మెడికల్‌ కౌన్సిలింగ్‌ను పూర్తి పారదర్శికంగా జరపడానికి ప్రభుత్వం అంగీకరించిందని పేర్కొన్నారు. అంగీకరించిన డిమాండ్లకు  సంబంధించిన వారం రోజుల్లో జీవో జారీ చేస్తామని వైద్యాధికారులు హామీ ఇచ్చినట్లు జూనియర్‌ డాక్టర్లు తెలియజేశారు.