జెడ్పి చైర్మన్ పుట్ట మధు పరామర్శలు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని 7వ వార్డ్ లో అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణుభక్తుల అంజమ్మ ని మంగళవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించారు. మంథని పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న మల్హర్ మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ మల్క గోపాల్ ని పరామర్శించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంథని పట్టణంలోని 12 వార్డ్ లో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మాచిడి సత్యనారాయణ తల్లి కిష్టమ్మ మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పుట్ట మధు పరామర్శించారు.