జేఎన్‌టీయూలో సమాధాన పత్రాల కుంభకోణం
హైదరాబాద్: జేఎన్‌టీయూలో సమధాన పత్రాల కుంభకోణం బట్టబయలైంది. ప్రశ్నా పత్రాలు ఇంటికే పంపి సమాధానాలు రాయిస్తున్న ముఠాపై సమాచారమందుకున్న పోలీసులు ముఠా సభ్యులపై నిఘా పెట్టారు. ఈకుంభకోణానికి సంబంధించి 13 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో జేఎన్‌టీయూ సిబ్బంది కూడా ఉన్నారు.