టాటా ఏఐఏ బీమా చెక్కు పంపిణీ చేసిన సర్పంచ్
హుజూర్ నగర్ మార్చి 15 (జనంసాక్షి): కోదాడ టాటా ఏఐఏ జీవిత బీమాకు సంబంధించిన లక్ష రూపాయల విలువ గల చెక్కు ను
బూరుగడ్డ సర్పంచ్ సలీమారంజాన్ బుధవారం పంపిణీ చేశారు.
హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన పార్తనబోయిన నరసింహారావు డిసెంబర్ నెలలో మృతిచెందగా నామిని అయిన అతని భార్య పార్తనబోయిన సైదమ్మకు లక్ష రూపాయల గల చెక్కును సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ పోలిశెట్టి సైదులు మాట్లాడుతూ టాటా ఏఐఏ మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇన్సూరెన్స్ పాలసీలు కల్పిస్తుందని. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ టాటా ఏఐఏ మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను సద్వినియోగపర్చుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శీలం ఆదెమ్మ, మీగడ రామయ్య, గండు మల్లయ్య, గండు చిన్న సైదులు, మాడుగుల చిన్న మల్లయ్య, ఆవుల వెంకటయ్య, శోభ, షేక్ తారబి, జ్యోతి, నాగమ్మ, రమణ, కవిత, మాధవి, మంగమ్మ, గురవయ్య, మైక్రో ఇన్సూరెన్స్ ఏజెంట్లు మాడుగుల జ్యోతిసీతారాములు,
సుశీల, నాగమ్మ, నాగలక్ష్మి, సునీత, వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.