టిఎస్ పి ఎస్ సి పేపర్ లికేజీ పై న్యాయ విచారణ జరిపించాలని అతహర్ డిమాండ్

.
భువనగిరి టౌన్ జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లికేజీ పై సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అతహర్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో అసలు ప్రభుత్వం ఉందా ఒకవేళ ఉంటే పని చేస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎం చేస్తుందని ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతికి ప్రశ్న్తా పత్రం ఎలా లభించిందని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే దీని వెనుక పెద్ద పెద్ద వారే ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతుందని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే అన్ని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ కమిటీ వేసి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అన్నారు.బీద నిరుద్యోగులు గ్రామాల నుండి హైదరాబాద్ కు వచ్చి అద్దె రూమ్ లలో గ్రామం నుండి తెచ్చుకున్న బియ్యం వండుకొని, పచ్చళ్ళు వేసుకొని తిని కష్ట పడి చదివి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు డబ్బుల కొరకు ప్రశ్న్తా పత్రాలు అమ్ముకొని బీద నిరుద్యోగులను మోసం చేస్తున్నారని వాపోయారు.కెసిఆర్ పాలనలో అన్ని స్కామ్ లే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.