టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ అధ్యక్షులుగా సయ్యద్ మహబూబ్ అలీ ప్రధాన కార్యదర్శి గా జొన్నలగడ్డ శ్రీనివాస్ శాస్త్రి
జహీరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ డివిజన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్గోయ్ ప్రభాకర్, నరసింహారెడ్డి ప్రకటించారు. జహీరాబాద్ పట్టణం రామ్ నగర్ సమీపంలో గల తవక్కల్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జహీరాబాద్ డివిజన్ ద్వితీయ మహాసభలలో 21మంది సభ్యులు గల జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, మొగుడంపల్లి మండలాలతో కూడిన జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు గా సయ్యద్
మహబూబ్ అలీ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శాస్త్రి, ఉపాధ్యక్షులుగా బంటు పురుషోత్తమ రావు, మహమ్మద్ సత్తార్, ప్రశాంత్, హరికృష్ణ, మహారుద్ర స్వామి, సహాయ కార్యదర్శులు గా పబ్బతి సంతోష్, ముజాహిద్, రోషన్, రాజేందర్, ప్రచార కార్యదర్శిగా రాయకోటి నర్సింలు, కోశాధికారి ఎం. బస్వరాజ్, కార్యవర్గ సభ్యులుగా కరీం, బక్కన్న. సద్దాం .బాబురావు, జమీర్, రవి, రాజు స్వామి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ కార్యదర్శి నరసింహారెడ్డి వివరించారు.