టి.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ ను వెంటనే తొలగించాలి:

 నక్క విజయ్ కుమార్…టి.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ ను వెంటనే తొలగించాలి: నక్క విజయ్ కుమార్…
టి.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ ను వెంటనే తొలగించి, బోర్డును రద్దు చేయాలని బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు.TSPSC చైర్మన్ ను తొలగించి.,బోర్డును రద్దు చెయ్యాలని…బహుజన్ సమాజ్ పార్టీ.. ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి నక్క విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్మారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జి నక్క విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే కుటుంబానికి ఒక్క ఉద్యోగిని తయారు చేసుకోవచ్చని నమ్మబలికితే ఆనాడు విద్యార్థులు, నిరుద్యోగులు,ఉద్యోగులు, సబ్బండా వర్గాల ప్రజలంతా తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యార్థుల, నిరుద్యోగుల జీవితాలను ప్రభావితం చేసేటటువంటి ఉద్యగ నియామక పరీక్ష పత్రాలు లీక్ కావడమనేది, అదీ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన టి.ఎస్.పి.ఎస్సీ బోర్డు నిర్వహించే గ్రూప్ వన్ పరీక్ష పత్రాలు లీక్ కావడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇంతటి అవకతవకలకు కారణమైన బోర్డు చైర్మన్ ను వెంటనే తొలగించి, సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని, అదేవిధంగా మూప్పై లక్షల మంది నిరుద్యోగులకు తగిన న్యాయం జరగాలంటే ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని, పరీక్షలకు సంసిద్ధం అవుతున్న ప్రతి నిరుద్యోగికి ఒక లక్ష రూపాయల చొప్పున వారి ప్రిపరేషన్ ఖర్చుల నిమిత్తం చెల్లించాలని లేనియెడల బహుజన సమాజ్ పార్టీ పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈ రిలే నిరాహార దీక్షను ధర్మారంకు చెందిన కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి నియోజకవర్గ ఇంచార్జి విజయ్ కుమార్ కు మరియు దీక్షలో కూర్చున్న నాయకులకు జ్యూస్ ఇచ్చి విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు గొడుగు ప్రశాంత్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు ముంజ లీల గౌడ్, వెల్గటూర్ మండల అధ్యక్షుడు బచ్చల స్వామి, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి మద్దెల రాజశేఖర్,  నాయకులు దీకొండ అజయ్, బచ్చల స్వామి, శైలందర్, అనిల్, ప్రశాంత్, ధర్మారం మండల యూత్ అధ్యక్షులు షర్ఫాదీన్, మేడవేణి స్వామి, రాజయ్య, అనవేణి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.