టీఆర్ఎస్ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరింది :బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం  నాగోల్ డివిజన్ కి విచ్చేసిన ప్రియతమ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ కి స్వాగతం పలికిన నాగోల్ కార్పొరేటర్ చింతల సురేందర్ యాదవ్ . ఈ సందర్బంగా సంజయ్  మాట్లాడుతూ నాగోల్ డివిజన్ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా సర్వే నెంబర్ -58 ఇళ్ల స్థలాల పట్టాలు ఏమయ్యాయని,  అదేవిదంగా డబుల్ బెడ్ రూమ్ లు నాగోల్ డివిజన్ కు ఎన్ని ఇచ్చారో లెక్క చెప్పాలని, టీఆర్ఎస్ పాలనలో అవినీతి తారా స్థాయికి చేరిందని, ఈడి, సిబిఐ పేరు వింటే కెసిఆర్ కుటింబికులకు వెన్నులో వణుకు పుడుతుందని, రాబోయే కాలంలో ప్రజలు సంఘటితమై కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని సంజయ్ గారు తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, పేరాల శేఖర్ జీ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.