టీడీపీని నాశనం చేసేందుకు కుట్ర
హైదరాబాద్: వైకాపా, టీఆర్‌ఎస్,కాంగ్రెస్ కలిసి తెలుగుదేశం పార్టీని నాశనం చసేందుకు కుట్ర పన్నుతున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందులో బాగంగానే ఐఎంజీ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. ఐఎంజీ కేసులో తప్పుడు సమాచారంతో తనపై కోర్టులో కేసు వేశారన్నారు. వైకాపా,టీఆర్‌ఎస్, కలిసి కేసు వేస్తే దానికి ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. గతంలో చాలసార్లు కోట్టేసిన కేసును మళ్లీ కోర్టులో వేయటం వెనక అంతర్యమేంటని ప్రశ్నించారు. అలాగే ఈ రోజు తెలంగాణపై చర్చ జరిగింది. తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖను ఎప్పుడు వెనక్కి తీసుకోలేదని, కావాలనే కొన్నిపార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని, ఇవాళ,రేపు తెలంగాణపై చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కార్యకర్తలు సహకరించాలని, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.